Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 22, 2026Short Read
సెప్టెంబర్లో అనకాపల్లికి పోలవరం నీరు: చంద్రబాబు
సెప్టెంబర్ మొదటి వారంలోగా పోలవరం ప్రాజెక్టు ద్వారా అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలకు గోదావరి జలాలను అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
అనకాపల్లి జిల్లా అలమండ కోడూరులో జరిగిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంచి పనులు చేస్తుంటే కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
అమరావతికి క్వాంటం కంప్యూటర్, విశాఖపట్నానికి డేటా సెంటర్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వచ్చాయన్నారు.
ఇతర రాష్ట్రాల వారు ఆశ్చర్యపోతుంటే, ఇక్కడి వారు మాత్రం నిరసనలకు దిగుతున్నారని ఆయన విమర్శించారు.
డేటా సెంటర్ రాకముందే అది వెళ్లిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రతిపక్షాలను తప్పుబట్టారు.





